తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.55

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.35

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.11.15 ల11.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

ఈరోజు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు.కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

వైఎస్సార్ కూడా టాలీవుడ్ హీరోలను అవమానించారు.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది.

బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి.ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మిథునం:

ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

కర్కాటకం:

ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది.నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.ఆలోచనలు ఆచరణలో పెడతారు.

బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

సింహం:

ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఉద్యోగమన వివాదాలు సర్దుమణుగుతాయి.

కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

కన్య:

ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి.

వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తుల:

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి.

వృశ్చికం:

ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

ధనుస్సు:

ఈరోజు బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం:

ఈరోజు దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు.వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.

దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది.

కుంభం:

ఈరోజు స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభం:

ఈరోజు వాహన ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి.బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు.

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తాజా వార్తలు