ఐపీఎల్ సీజన్ లో ప్రతి టీం కూడా తనదైన రీతిలో సత్తా చాటుతో ముందుకు సాగుతుంది.ఇక ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( Royal Challengers Bengaluru ) టీమ్ లా మధ్య జరగబోయే మ్యాచ్ లో హైదరాబాద్ తమ అధిపత్యాన్ని చూపిస్తుందనే వార్తలైతే వస్తున్నాయి.
నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడితే అందులో ఐదు విజయాలను నమోదు చేసుకొని 10 పాయింట్లతో నెంబర్ త్రీ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఎనిమిది మ్యాచ్ లు ఆడితే అందులో ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి పాయింట్స్ టేబుల్ ల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.

ఇక ఈ రెండు జట్లల్లో ఈరోజు ఏ టీం గెలవబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఇక మొత్తానికైతే హైదరాబాద్ టీం తనదైన రీతిలో దుమ్ము రేపుతూ ముందుకు దూసుకెళ్తుంది.కాబట్టి హైదరాబాద్ టీమ్ ని ఓడించడం బెంగళూరు టీం వల్ల అయ్యే పని కాదు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఎందుకంటే హైదరాబాద్ టీం లో అభిషేక్ శర్మ,(
Abhishek Sharma ) ట్రావిస్ హెడ్,( Travis Head ) క్లాసిన్ లాంటి ప్లేయర్లు అద్భుతమైన ఫామ్ లో ఉండి ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ తనదైన రీతిలో ప్రతిభ చూపిస్తున్నాడు.అందువల్లె ఈ టీమ్ ఈజీగా మ్యాచ్ అయితే గెలవగలుగుతుంది.ఇక ఇదిలా ఉంటే ఈ టీం లో విరాట్ కోహ్లీ, ( Virat Kohli ) డూప్లేసిస్, మాక్స్వెల్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళు చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇస్తున్నారు.అయినప్పటికీ ఈ టీంలో బౌలింగ్ లో చాలా లోపాలు ఉండటం వల్లే వాళ్ళు ఈసారి ఆడిన ప్రతి మ్యాచ్ లో ఓడిపోవాల్సి వస్తుంది.
ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీం కి 70% గెలిచే అవకాశం ఉంటే, బెంగుళూర్ కి 30% మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి…
.