తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై27, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.55

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.52

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.45 ల11.15

Advertisement
Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu July 27 Saturday 2024 , Ju

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu July 27 Saturday 2024 , Ju

ఈరోజు ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి.

కుటుంబ సభ్యులతో దూరప్రయాణ సూచనలున్నవి.వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

వృషభం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu July 27 Saturday 2024 , Ju
Advertisement

ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది.కుటుంబ సమస్యల పరిష్కరించుకుంటారు.

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మిథునం:

ఈరోజు అవసరానికి చేతికిడబ్బు అందుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు.మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు.

వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి.

కర్కాటకం:

ఈరోజు చేపట్టిన పనులులో శ్రమాధిక్యత కలుగుతుంది.వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు.

కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి.ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.వ్యాపారాలు మరింత మందగిస్తాయి.

ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

కన్య:

ఈరోజు మొండి బకాయిలు వసూలవుతాయి.చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు.మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:

ఈరోజు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.

చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు.

సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

ధనుస్సు:

ఈరోజు ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది.పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు.

నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం:

ఈరోజు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి.వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

కుంభం:

ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.వ్యాపారాలలో వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి.

మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయట పడతారు.

మీనం:

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది.ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమౌతారు.వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి.

తాజా వార్తలు