తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు.అందులో సందీప్ కిషన్( Sundeep Kishan ) ఒకరు.
ప్రస్తుతం సందీప్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇక హీరో గానే కాకుండా మంచి క్యారెక్టర్ దొరికితే కీలకమైన పాత్రలో కూడా నటించడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చాలాసార్లు ప్రూవ్ చేసాడు.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ధనుష్ హీరోగా వచ్చిన రాయన్ సినిమాలో( Raayan Movie ) కూడా ఆయన ఒక కీలకపాత్రలో నటించాడు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన త్రినాధరావు నక్కిన( Trinadharao Nakkina ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇంతకు ముందు త్రినాధరావు నక్కిన చేసిన గత సినిమాలను కనక మనం చూసుకున్నట్లైతే అన్ని సినిమాలు కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా కమర్షియల్ జానర్ లో తెరకెక్కడం విశేషం… ఇక మరోసారి అదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసే సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను చొరగొంటున్నాయి.
కాబట్టి ఇప్పుడు సందీప్ కిషన్ తో చేయబోయే సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ధమాకా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఆయన స్టార్ హీరోతో సినిమా చేయకుండా సందీప్ కిషన్ తో ఎందుకు సినిమా చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక మొత్తానికైతే సందీప్ కిషన్ గత చిత్రమైన ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.దాంతో ఇప్పుడు మరోసారి త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు…
.