సీనియర్ హీరోయిన్లలో ఒకరైన టబు( Tabu ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.టబు ప్రస్తుతం తెలుగులో పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్వ్యూలో టబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నటి షబానా అజ్మీ నాకు బంధువు అని ఆమె అన్నారు.
ఒకసారి ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో డైరెక్టర్ శేఖర్ కపూర్( Director Shekhar Kapoor ) నన్ను చూశారని టబు పేర్కొన్నారు.
నాతో దుష్మణి అనే సినిమా చేయాలని ఉందని శేఖర్ కపూర్ చెప్పారని టబు పేర్కొన్నారు.
ఆ సమయంలో నేను పదో తరగతి చదువుతున్నానని ఆమె వెల్లడించారు.చదువుపై ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి రానని చెప్పానని టబు తెలిపారు.ఆయన చాలాసార్లు అడగడంతో చివరకు అంగీకరించానని ఆమె అన్నారు.పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక సినిమాకు సంతకం చేశానని ఆమె అన్నారు.
ఏమైందో ఏమో తెలియదని ఆదిలోనే అది ఆగిపోయిందని టబు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత అదే మూవీ మనిషా కోయిరాలా, సన్నీ దేవోల్ ప్రధాన పాత్రల్లో బంటీ డైరెక్షన్ లో తెరకెక్కిందని టబు అన్నారు.కొంతకాలం తర్వాత శేఖర్ కపూర్ మళ్లీ నన్ను కలిసి ప్రేమ్ సినిమాలో( Prem Movie ) నటించాలని కోరామని టబు అభిప్రాయపడ్డారు.ఆ సమయంలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నానని టబు పేర్కొన్నారు.
శేఖర్ బలవంతం చేయడంతో ఆ సినిమాకు అంగీకరించి సంతకం చేశానని ఆమె చెప్పుకొచ్చారు.షూటింగ్ మొదలైన తర్వాత శేఖర్ కపూర్ ఆ సినిమా నుంచి వైదొలిగారని ఆ ప్రాజెక్ట్ షూట్ ఐదేళ్లు జరిగిందని ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినందుకు చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొన్నారు.టబు వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.