తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్1, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.56

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50

రాహుకాలం: మ1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.8.20 ల9.32

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది.

సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి.వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

బంధు వర్గం వారితో మాట పట్టింపులుంటాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

మిథునం:

ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

కర్కాటకం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది.

చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి.

సింహం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది.చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఉద్యోగమున పనిభారం తప్పదు.

విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

కన్య:

ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.దైవ చింతన పెరుగుతుంది బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

తుల:

ఈరోజు చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు.

వృశ్చికం:

ఈరోజు ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది.

ధనుస్సు:

ఈరోజు ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది.దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మకరం:

ఈరోజు మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి.దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

కుంభం:

ఈరోజు ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చుతాయి.స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి.

వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మీనం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నూతన రుణయత్నాలు సాగిస్తారు.బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది.ఆలయాలు సందర్శనాలు చేసుకుంటారు.

సోదరులతో స్థిరస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడుతాయి.

తాజా వార్తలు