తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 25, సోమవారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

48

రాహుకాలం: ఉ.7.30 నుంచి 03.40 వరకు

అమృత ఘడియలు: సా.03.40 నుంచి 06.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 నుంచి 1.38 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.ఖర్చు తగ్గించుకోవడం మంచిది.అనవసరమైన విషయాలలో తల దూర్చకండి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

సింహం:

ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

తరచూ మారే మి నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది.

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

తులా:

ఈరోజు మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి సమయాన్ని ఎక్కువగా కడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

ధనస్సు:

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.వాయిదా బట్ట పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.అవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాలకి గొడవలకు దిగకండి.

ఈరోజు మీలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.మీరు చేసే పనిలో అంతా శుభమే జరుగుతుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

మీనం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టడం మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వర్గ సంబంధిత విభేదాలు జరుగుతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తాజా వార్తలు