తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 3, సోమవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.50

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

48

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00నుంచి 10.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.12.47 నుంచి 01.38 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా బాగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల సమాజంలో మంచి గౌరవం అందుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

సమయం అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా పూర్తవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులకు సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యులతో గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించండి.

చిన్నచిన్న పనులు వాయిదా పడతాయి.దూరప్రాంత బంధాలనుండి శుభవార్త వింటారు.

మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం లో ఆలస్యం చేస్తారు.తోబుట్టువులతో కలిసి జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు