స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి కేటీఆర్ ? త్వరలో విశాఖ టూర్ ?

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి చాలా స్పీడ్  గా ఉంది.

  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా, తాము లెక్కచేయబోమని, స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే తీరుతాం అంటూ కేంద్రం మొండి పట్టుదలతో ఉంది.

ఈ మేరకు ఈ తతంగాన్ని త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇక ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఏపీ లోని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్న, అనుకున్నంత స్థాయిలో ఆ ప్రయత్నం అయితే వర్కౌక్ ఔట్ కావడం లేదు  అనే విషయం అర్థమైపోయింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆశించినంత స్థాయిలో రాజకీయ పార్టీల స్పందన కనిపించడం లేదు.కేవలం ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మొక్కుబడిగా కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ యాక్టివ్ అయ్యేందుకు  ప్రయత్నిస్తోంంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకునేందుకు ఏపీకి తాము మద్దతిస్తామని,  సీఎం కేసీఆర్ అనుమతిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటాము అంటూ తెలంగాణ మంత్రి,  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.

Advertisement
Telangana Minister Ktr To Support Vizag Steel Plant Movement Soon Vizag Tour , T

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్టీల్ ప్లాంంట్ వ్యవహారాన్ని   తెరపైకి తెచ్చారు.ముఖ్యంగా సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ, వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేంద్రం అన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంందని, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి కారణం కేంద్ర వైఖరి అని , చూస్తూ ఊరుకుంటే తెలంగాణ లోనూ బీహెచ్ఈఎల్ , సింగరేణి వంటి సంస్థలను ప్రైవేటీకరించేందుకు ఏ మాత్రం వెనకాడబోదు అని, ఏపీలో స్టీల్ ప్లాంట్ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం ఇదే విధంగా ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయంం తీసుకుంటేే, అప్పుడు తమకు అండగా ఉండాలని కేటీఆర్ కోరారు.

Telangana Minister Ktr To Support Vizag Steel Plant Movement Soon Vizag Tour , T

ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై టిఆర్ఎస్  ఇంతగా సానుకూలత  వ్యక్తం చేయడానికి కారణం తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్న సీమాంధ్ర ఓటర్లే కారణంగా అర్థం అవుతోంది.ఏది ఏమైతేనేం బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్ ఏపీ లోని ఉద్యమానికి మద్దతు ఇస్తే మరింత గా ఈ ఉద్యమం వేడెక్కే అవకాశం లేకపోలేదు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
Advertisement

తాజా వార్తలు