రేవంత్ కు సొంత నేతలే శత్రువులా ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉంది.తాను ఒక వైపు అధికార పార్టీ టిఆర్ఎస్ పై అలుపెరగని పోరాటం చేస్తుంటే, సొంత పార్టీలోని నాయకులు తన ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రయత్నాలు చేస్తుండటం రేవంత్ కు తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని కలిగిస్తుంది.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యం కావడంతో రేవంత్ పూర్తిగా దృష్టాంత దానిపైన పెట్టారు.కానీ కాంగ్రెస్ సీనియర్లు అంతా ఏకమై తనపై అసంతృప్తి రాగం వినిపించడంతో పాటు, కాంగ్రెస్ కు డ్యామేజ్ జరిగే విధంగా వ్యవహారాలు చేస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఎప్పటికప్పుడు పరిస్థితులు చక్కబడతాయి అన్నట్లుగానే రేవంత్ ముందుకు వెళ్తున్నారు.తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పై రివ్యూ మీటింగ్ పెట్టారు.

ఆ సభకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు ఆహ్వానం అందింది.దీంతో సమావేశానికి తాను హాజరు కాబోతున్నట్లు బట్టి విక్రమార్క ప్రకటించడమే కాకుండా, ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

అయితే ఈ వ్యవహారాలు సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా చేస్తుండడం, తనకు క్రెడిట్ రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండటం వంటివి ఇబ్బంది కరంగా మారాయి.అయితే బట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరు కావడం వెనుక కారణాలను కూడా సీనియర్ నాయకులు ప్రస్తావిస్తున్నారు.

కెసిఆర్ రైతుబంధు ప్రాజెక్టు అమలుకు సన్నాహక సమావేశం నిర్వహించారు.ఇందులో భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గం లోని చింతకాని మండలం కూడా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే గా విక్రమార్క కు ఆహ్వానం అందింది .

ఈ నేపథ్యంలోనే ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కిగౌడ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు దీనిపై చర్చించారు. బట్టి విక్రమార్క కేసీఆర్ సమావేశానికి వెళ్లాలని, ఈ సందర్భంగా కాంగ్రెస్ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించాలని సూచించారు.అయితే ఈ సమావేశం నిర్వహించిన సీనియర్ నేతలలో మధుయాష్కిగౌడ్ మినహా మిగిలిన నాయకులంతా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా ముద్రపడిన వారే.

దీంతో ఈ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది కనిపిస్తున్నాయి.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు