టి.బీజేపీ మోడీనే నమ్ముకుందా ?

తెలంగాణలో ఎన్నికల( Telangana elections ) వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారలతో హోరెత్తిస్తున్నాయి.

అధికారం కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

అయితే ప్రచారం విషయంలో బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు యమ దూకుడు కనబరుస్తుంటే బీజేపీ మాత్రం.ఇంకా తడబడుతూనే ఉంది.

జాతీయ నేతలు వరుసగా రాష్ట్ర పర్యటనలు చేస్తున్నప్పటికి పార్టీలో మాత్రం ఇంకా జోష్ కనిపించడం లేదు.గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ( Narendra Modi ) తెలంగాణలో వరుస పర్యటనలు చీస్తున్నారు.

ఆ మద్య ఏడో తారీఖున బీసీ బహిరంగ సభకు వచ్చిన మోడీ.ఆ తరువాత రెండు రోజుల వ్యవధిలోనే 11 న మళ్ళీ ఎస్సీ బహిరంగ సభకు హాజరయ్యారు.

Advertisement

ఇక ఈ నెల 25, 26, 27 తేదీల్లో కూడా రాష్ట్రంలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించేందుకు సిద్దమయ్యారు.

దీంతో మొత్తం మీద ఒకే నెలలోనే ఐదు సార్లు రాష్ట్ర పర్యటనలో నిమగ్నమయ్యారు మోడీ.మరి మోడీ ఈ స్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టడానికి కూడా కారణం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు గట్టిగా జరుగుతున్నాయి.

పైగా సరైన ప్రచారం లేకపోవడంతో కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో టి.బీజేపీలో జోష్ నింపేందుకు స్వయంగా మోడీనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నేతలు ఎంతమంది ఉన్నప్పటికి మోడీ పర్యటించడం కొంత ప్రత్యేకమే అయినందున తెలంగాణలో ప్రధాని రాకతోనైనా అందరి దృష్టి బీజేపీ( BJP )పై పడుతుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం.

ఇప్పటికే బీసీలకు, ఎస్సీలకు హామీలు ప్రకటించి హాట్ టాపిక్ అయిన ప్రధాని.ఇక ముందు రోజుల్లో నిర్వహించబోయే రోడ్ షోలలో ఎలాంటి ప్రకటనలు చేస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.అయితే పార్టీ భారమంతా మోడీపైనే మోపడం వల్ల ఉపయోగం ఉండదనేది కొందరి అభిప్రాయం.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలలో అందరూ నేతలు కలిసి కట్టుగా ప్రచారల్లో పాల్గొంటున్నారు.కానీ బీజేపీలో మాత్రం రాష్ట్ర అగ్రనేతలు ఎడమొఖం పెడమొఖం గానే వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో మోడీ పైనే ఆధార పడడం ఆ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు