గూగుల్ లో ఉద్యోగాన్ని వదులుకుంది.. ఆ బిజినెస్ తో రెట్టింపు లాభాలు.. తేజస్విని సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

సాధారణంగా గూగుల్ లో జాబ్( Google Job ) అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.

గూగుల్ ఇచ్చే స్థాయిలో సౌకర్యాలు ఇచ్చే కంపెనీలు సైతం దాదాపుగా ఉండవనే సంగతి తెలిసిందే.

వరంగల్ కు చెందిన పామిరెడ్డి తేజస్విని( Pamireddy Tejaswini ) తన అభిరుచిని వ్యాపారంగా మలచుకోవడానికి గూగుల్ లో ఉద్యోగాన్ని వదులుకున్నారు.సులువుగానే తేజస్విని ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం గమనార్హం.

తేజస్విని డీక్లట్టర్ ఆర్గనైజర్ గా( Decluttering Organizer ) వినూత్నమైన జాబ్ ను ఎంచుకున్నారు.తేజస్విని మాట్లాడుతూ కల అంటే నిద్రలో వచ్చేది కాదని నిద్రపోనివ్వకుండా చేసేదని అబ్దుల్ కలాం( Abdul Kalam ) చెప్పిన మాటలను స్పూర్తిగా తీసుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.

ఆ మాటల వల్లే కోరుకున్న పని చేయాలనే ఆలోచనతో లక్షల వేతనం ఇచ్చే కార్పొరేట్ కొలువుని సులువుగా వదులుకున్నానని తేజస్విని చెప్పుకొచ్చారు.నా నిర్ణయం తెలిసి ఇంతకంటే తెలివితక్కువ పని మరొకటి లేదని అన్నారని అమె పేర్కొన్నారు.

Advertisement

అయినప్పటికీ నేను నా ఒపీనియన్ చెప్పి డీక్లట్టరింగ్, ఆర్గనైజింగ్ సేవలను అందించే బిజినెస్ ను( Business ) మొదలుపెట్టానని తేజస్విని చెప్పుకొచ్చారు.బాల్యం నుంచి నా దుస్తులు, వస్తువులను ఒక వరుసలో సర్దుకోవడం, మరుసటి రోజుకు కావాల్సినవి ముందే సిద్ధం చేసుకోవడం పనులను ముందే చేసేదానినని తేజస్విని కామెంట్లు చేశారు.అమ్మ నుంచి నాకు ఈ పద్ధతి అలవాటు అయిందని ఆమె పేర్కొన్నారు.

సర్వీసులకు ప్రస్తుతం బోలెడంత డిమాండ్ ఉందని తేజస్విని కామెంట్లు చేశారు.కస్టమర్ల అవసరాలు, బడ్జెట్ కు అనుగుణంగా పని చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.మా కస్టమర్లలో నభా నటేష్, లాస్య, అస్మిత లాంటి వారు ఎంతోమంది ఉన్నారని తేజస్విని పేర్కొన్నారు.

తేజస్విని వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తేజస్విని తన టాలెంట్ తో ఎంతో ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!
Advertisement

తాజా వార్తలు