అయోధ్య రామ మందిరానికి హనుమాన్ టీం అందించిన విరాళం లెక్కలివే.. ఏకంగా అన్ని రూ.కోట్లా?

హనుమాన్ మూవీ( Hanuman Movie ) చిన్న సినిమాలలో పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తోంది.

ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్లు నాలుగు మిలియన్ డాలర్ల మార్కును దాటాయి.

అయితే హనుమాన్ సినిమా ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు విరాళంగా ఇస్తామని చెప్పిన హనుమాన్ టీం కోట్ల రూపాయల విరాళం ప్రకటించి ప్రశంసలు అందుకుంటోంది.అయోధ్య రామ మందిరానికి( Ayodhya Ram Mandir ) హనుమాన్ టీం విరాళం ఏకంగా 2 కోట్ల 66 లక్షల 41 వేల 55 రూపాయలు కావడం గమనార్హం.

హనుమాన్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 53 లక్షల 28 వేల 211 టికెట్లు అమ్ముడయ్యాయట.ఇచ్చిన మాట ప్రకారం హనుమాన్ టీం విరాళం ఇవ్వడాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఈరోజు కూడా ఇతర సినిమాలతో పోలిస్తే హనుమాన్ కు బుకింగ్స్ బాగున్నాయి.

Advertisement

సినిమాలలో చిన్న సినిమా, పెద్ద సినిమా ఉండవని ఏ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటే అదే పెద్ద సినిమా అవుతుందని హనుమాన్ తో మరోసారి ప్రూవ్ అయింది.హైదరాబాద్ లో( Hyderabad ) ఈరోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో హనుమాన్ మూవీ ప్రదర్శితమవుతోంది.సీడెడ్, ఆంధ్రాలో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి.

ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బుకింగ్స్ పరంగా టాప్ లో నిలిచింది.

తేజ సజ్జా,( Teja Sajja ) ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) కాంబినేషన్ లో జై హనుమాన్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హనుమంతుని పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా.త్వరలో జై హనుమాన్ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.ప్రశాంత్ వర్మ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

హనుమాన్ హిందీ వెర్షన్ బుకింగ్స్ కూడా బాగున్నాయి.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు