టీం ఇండియా ఆటగాళ్లకు సెకండ్ డోస్ అక్కడే..!

కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీ స్థాయిలో జరగాల్సిన ఐపిఎల్ 14వ సీజన్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

ఇక త్వరలో టీం ఇండియా న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది.

అయితే ఇటీవలే టీం ఇండియా క్రికెటర్లకు ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ అందించారు.రెండో డోస్ కు ఇంకాస్త టైం ఉంది అందుకే బీసీసీఐ వారికి సెకండ్ డోస్ ను ఇంగ్లండ్ లోనే ఇప్పించే ఏర్పాట్లు చేస్తుంది.

యూకె ఆరోగ్య శాఖ కూడా ఇందుకు ఓకే చెప్పడంతో టీం ఇండియా ఆటగాళ్లకు ఇంగ్లండ్ లో కరోనా సెకండ్ డోస్ టీకా వేస్తారని తెలుస్తుంది.ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జూన్ 18 నుండి ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ లో జరుగనుంది.

కరోనా కారణంగా ముందుగానే ఇరు జట్ల సభ్యులు క్వారెంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా జరిగినట్టు చెబుతున్నారు.

Advertisement

ఇదే కాకుండా భారత మహిళ క్రికెట్ జట్టు కూడా ఇంగ్లండ్ లో పర్యటించనుంది.స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ మహిళలు, పురుషుల జట్లకు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు