ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి టీడీపీ యత్నం..నెలకొన్న ఉద్రిక్తత!

ఏపీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.దీంతో తాడేపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ కు వినతిపత్రం ఇస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.ఈ క్రమంలో జగన్ నివాసానికి బయలుదేరిన టీడీపీ నాయకులను తాడేపల్లి పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ నేపథ్యంలోనే బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు