టీడీపీకి ఝలక్ ఇస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు... వైసీపీకి మద్దతు

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతీకార రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి.గతంలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని టీడీపీ పార్టీ అధికారికంగా పార్టీ కండువా కప్పి మంత్రి పదవులు సైతం ఇచ్చింది.

 Two Tdp Mla's Ready To Join Ysrcp, Ap Politics, Ap Cm Jagan, Janasena-TeluguStop.com

ఇప్పుడు దెబ్బకి దెబ్బ అన్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రయోగిస్తుంది.అయితే టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలని దూరం చేయడంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకి వెళ్తున్నారు.

ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలని తన వైపుకి లాక్కుని ఆరికి స్వాతంత్ర్య హోదా కల్పించారు.అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలని లైన్ లో పెట్టారు.

ఈ రోజు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ ని కలిసి తమ మద్దతు తెలియజేయబోతున్నట్లు తెలుస్తుంది.

టీడీపీ నుంచి గెలిచినా ఎమ్మెల్యేలని వైసీపీ పార్టీలో అధికారికంగా చేర్చుకోకుండా వారిని సొంత పార్టీకి దూరం చేసి అధికార పార్టీ మద్ధతురాలుగా చేసుకుంటుంది.

ఇప్పుడు కూడా పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి రెడీ అయిపోయారని తెలుస్తుంది.ఈ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరిపి వైసీపీకి సపోర్ట్ చేసే విధంగా ఒప్పించినట్లు తెలుస్తుంది.మొత్తానికి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకి పదవులు, డబ్బు వాడుకుంటే, ఇప్పుడు వైసీపీ కూడా అదే దారిలో వెళ్తూ టీడీపీ ఎమ్మెల్యేలకి గాలం వేస్తుంది.

ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube