విశాఖ సీఐడీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణనీ పోలీసులు అరెస్టు చేశారు.దీంతో విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
వెలగపూడి ని అరెస్టు చేసి అనంతపురం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.దీంతో ఏసీపీపై ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సీనియర్ నాయకుడు నర్సీపట్నం నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు విశాఖ సీఐడీ కార్యాలయం దగ్గరకు రాకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.
మరోపక్క అయ్యన్నపాత్రుడునీ అక్రమంగా అరెస్టు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ విషయానికి సంబంధించి మరి కాసేపట్లో టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.అయ్యన్న అరెస్ట్.తదుపరి కార్యాచరణ పరిణామాలపై చర్చించనున్నారు. ఇక ఇదే సమయంలో అరెస్టు చేసిన అయ్యన్నపాత్రుని ఈరోజు ఏలూరు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.
అయ్యన్నపాత్రుడు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.