ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ..
సెపరేట్ స్టేట్ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ.రెండో సారి కూడా మళ్లీ అధికారంలోకి వచ్చింది.
అలా పింక్ పార్టీ గవర్నమెంట్ రెండో టర్మ్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది.ఈ క్రమంలోనే మరో సారి అనగా మూడోసారి కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి ఎన్నికలతో పోలిస్తే రెండో సారి అద్వితీయమైన మెజారిటీతో అధికారంలోకి గులాబీ పార్టీ వచ్చింది.ఈ రెండో టర్మ్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.2018 డిసెంబర్ లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏ మేరకు విజయాలు సాధించింది.భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలపై ఫోకస్.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన పింక్ పార్టీ.2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కొంత తక్కువగానే పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు.16 స్థానాలు తమవే అని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది.కానీ, 9 స్థానాలే టీఆర్ఎస్‌కు దక్కాయి.
ఇక ఆ తర్వాత కాలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది.గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో హవా చూపింది.
కానీ, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచింది.జీహెచ్ఎంసీ మేయర్ పీఠం అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ అనుకున్న దాని కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
అలా అధికార టీఆర్ఎస్ పార్టీకి అనూహ్యమైన ఎదురు దెబ్బలు తగిలాయని చెప్పొచ్చు.‘దళిత బంధు’ అనే స్కీమ్ పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్‌లో ప్రారంభించినప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు గాలి వీచింది.
ఇక నిరుద్యోగ భృతి విషయం, పీఆర్సీ, రైతుల ధాన్యం కొనుగోలు వంటి విషయాలపైన టీఆర్ఎస్ స్పందన ఎలా ఉండబోతుందా అనేది ఆ పార్టీ ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.