విశాఖ సీఐటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కార్యాలయం లోపలికి వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు.ఆయనను అరెస్ట్ చేశారు.
మరోవైపు సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.టీడీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.తమ పార్టీ నేత అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు అరెస్ట్ ను పార్టీ లీగల్ సెల్ ఖండించింది.41 ఏ నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్ట్ చేశారని ఆరోపించింది.