సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.దీంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
సర్కారు వారి పాట వంటి ఘన విజయం సాధించిన తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగి పోయాయి.ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసాడు త్రివిక్రమ్.
ఫస్ట్ షెడ్యూల్ లోనే యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగాడు.SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ మధ్య మహేష్ సినిమాలన్నీ వరుస విజయాలు సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలను పెంచుకున్నారు.
మరి త్రివిక్రమ్ కూడా వరుస విజయాలు అందుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ ట్రీట్ రానుంది అని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.అది కూడా ఈ నెలలోనే రాబోతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వైట్ చేస్తున్నారు.నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టిన రోజు కావడంతో ఆ సందర్భంగా ట్రీట్ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రీట్ ఒక రోజు ముందుగానే ఉండనుందని టాక్.అంటే నవంబర్ 6న సాయంత్రమే ఈ ట్రీట్ ఉంటుందట.చూడాలి మరి ఎలాంటి ట్రీట్ వస్తుందో.