తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా , ఆ పార్టీని ఏదోరకంగా అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ,ఆయన తనయుడు టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా లోకేష్ ను టిడిపిలో కీలకం చేసి, తన స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే లోకేష్ శక్తిసామర్ధ్యాల పై తెలుగు తమ్ముళ్లు ఎవరికీ పెద్దగా ఆశలు లేవు.దీనికి కారణం లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రంగా ఉండడం, సభలు సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడలేకపోవడం, పార్టీ నేతల్లో నమ్మకం కలిగించే విధంగా వ్యవహారాలు చేయలేకపోవడం.
ఇలా ఎన్నో అంశాలు ఆ పార్టీ నేతల్లో లోకేష్ సామర్థ్యంపై నమ్మకం లేకుండా పోవడానికి కారణాలు అయ్యాయి. అయితే గత కొద్దిరోజులుగా చూస్తే లోకేష్ ట్విట్టర్ ను వదిలి బయటకు వచ్చారు.

హడావుడిగా ఏపీలో పర్యటనలు చేస్తున్నారు.పరామర్శ పేరుతో పార్టీ నాయకులను కలుస్తున్నారు.వారికి పార్టీ అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని భరోసా ఇస్తున్నారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్నారు.దీంతో లోకేష్ రాజకీయ సామర్ధ్యంపై అందరికీ నమ్మకాలు ఏర్పడ్డాయి.టిడిపి శ్రేణుల్లో నూ ఉత్చాహం బాగా పెరిగింది.
ఇటీవల విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ మరణించడంతో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు .అలాగే సంఘం డైరీ కేసు వ్యవహారంలో అరెస్టై జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ పై విడుదలైన దూళిపాళ్ల నరేంద్ర ను లోకేష్ కలిశారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు.

అసలు ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పు ఏంటో చెప్పాలి అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.అలాగే కరోనా విషయంలో కాని , వివిధ పథకాల విషయంలో కాని , లోకేష్ గట్టిగా నిలదీస్తూ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.ఈ పరిణామాలన్నీ టిడిపి నేతల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
గతంతో పోలిస్తే లోకేష్ ఎంతగా రాజకీయ పరిపక్వత చెందారో అంటూ తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారు.