బాలినేని భయపెడుతున్నారా ? జగన్ రియాక్షన్ ఏంటో?

టికెట్ల కేటాయింపులు ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు తలపోట్లు వస్తూనే ఉన్నాయి.టిక్కెట్లు దక్కని వారంతా అసంతృప్తికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం , మరి కొంతమంది ఇతర పార్టీలో చేరిపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

 Are You Afraid Of Baline What Is Jagan's Reaction, Jagan, Ap Cm Jagan, Ysrcp, A-TeluguStop.com

ఇక వైసిపి సీనియర్ నేత జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivas Reddy ) వ్యవహారం ఈ టిక్కెట్ల కేటాయింపు అంశం కంటే ముందు నుంచి జగన్ కు తలనొప్పి గానే మారింది.ఇటీవల కాలంలో తనకు ప్రాధాన్యం తగ్గించారని,  మంత్రి పదవి ఇస్తారనుకున్నా తనను పక్కన పెట్టారని బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.

చాలాసార్లు ఆయన వివాదాస్పదం అయ్యారు.దీంతో జగన్ సైతం బాలినేనిని దూరం పెడుతూనే వస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Ysrcp-Politics

జగన్ ను కలిసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.ఆయనకు అపాయింట్మెంట్ అయితే దక్కడం లేదు.దీంతో బాలినేని ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా హైదరాబాదులో ఉన్నారు.గతంలో బాలినేని కి జగన్( jagan ) ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు .ఎప్పుడు కలవాలి అనుకుంటే అప్పుడు జగన్ తో భేటీ అయ్యేవారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను బాలినేని ఒంగోలులో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.అయితే ఈసారి మాత్రం హైదరాబాద్ కే పరిమితం అయ్యారు.

సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు.డిసెంబర్ 12న జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న బాలినేని ఒంగోలుకు దూరంగా ఉంటున్నారు .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Ysrcp-Politics

అయితే ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని బాలినేని కుమారుడు ప్రకటించారు .వాటి కోసమే వేచి ఉన్నారని, రెండు రోజుల్లో 170 కోట్లు విడుదలవుతాయని సమాచారం ఉన్నట్లు బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి ( Praneet Reddy )చెబుతున్నారు.ఈ నిధులు విడుదల అయిన తర్వాతే తన తండ్రి ఒంగోలుకు వస్తారని చెబుతున్నారు.దీంతో బాలినేని అసంతృప్తికి కారణం ఇళ్ల స్థలాల విషయంలో జగన్ పట్టించుకోకపోవడం , రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ జరుగుతోంది.

అయితే బాలినేని  మాత్రం ఈ వ్యవహారాలపై స్పందించడం లేదు.దీంతో జగన్ బాలినేని విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube