కడప జైలు లో కరోనా కలకలం... జేసీ కి కూడా...

కడప జైలు లో కరోనా కలకలం రేగింది.దాదాపు 317 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.

మొత్తం 303 మంది ఖైదీలకు పాజిటివ్ రాగా,14 మంది జైలు సిబ్బందికి పాజిటివ్ ఉన్నట్లు సమాచారం.అయితే 303 మంది ఖైదీలలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇటీవల ఒక దళిత పోలీసు అధికారిని దూషించిన కేసులో పోలీస్ కస్టడీ ముగించుకున్న ఆయన రెండు రోజుల క్రితమే కడప జైలు కు తరలించిన విషయం విదితమే.అయితే తాజాగా కడప జైలు లో వెల్లడైన కరోనా పరీక్షల్లో జేసీ కి కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి విక్రయించారనే కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ మీద విడుదలై వస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.దీంతో ఆయన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, జనంతో భారీగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Advertisement

అంతేకాకుండా ర్యాలీ సమయంలో అడ్డుకున్నారు అన్న ఉద్దేశ్యం తో ఒక దళిత పోలీస్ అధికారితో వాగ్వివాదానికి దిగడమే కాకుండా అతడిని దూషించారు అంటూ కేసు నమోదు అవ్వడం తో వాహనాల విక్రయించారు అన్న కేసులో బెయిల్ పై విడుదల అయిన రెండు రోజులకే మరోసారి ఆయన అరెస్ట్ అవ్వడం గమనార్హం.

ప్రస్తుతం ఆయన దళిత అధికారిని దూషించిన కేసుకు సంబంధించి కడప జైలు లోనే ఉన్నారు.అయితే కడప జైల్లో మొత్తం 700 మంది ఖైదీలు ఉండగా, వారిలో 317 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేగుతుంది.ఒక్కసారిగా ఇంత తీవ్ర స్థాయిలో కేసులు బయటపడడం తో జైలు లో ఉన్న ఖైదీలు,అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా జైల్లోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇంత తీవ్ర స్థాయిలో కరోనా కేసులు బయటపడడం తో జైల్లో ఉన్న మిగిలిన ఖైదీలందరికీ కూడా కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.

అయితే జైలు లోనే ఉన్న వీరందరికి కరోనా ఎలా వచ్చింది అన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు.మరోపక్క రెండు రోజుల క్రితమే కడప జైలు కు వెళ్లిన జేసీ కి కూడా కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది అన్న దానిపై కూడా అధికారులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు