పోలవరంపై టీడీపీది తప్పుడు ప్రచారం.. మంత్రి అంబటి

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు.

ఇందులో భాగంగా అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలతో పాటు గైడ్ బండ్ పనులను ఆయన పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి తెలిపారు.గైడ్ బండ్ కుంగిపోవడం పెద్ద తప్పిదమని ప్రచారం చేస్తున్నారన్నారు.

గైడ్ బండ్ కు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నామన్న ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న చిన్న పొరపాట్లు జరగొచ్చని పేర్కొన్నారు.ఇకపై పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

Latest Latest News - Telugu News