ఏపీలో టీడీపీ కుట్రలు..! డీబీటీ లబ్ధిదారుల ఇక్కట్లు

ఏపీలో డీబీటీ లబ్దిదారులు( DBT Beneficiaries ) తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.టీడీపీ( TDP ) ముఠా కుట్రల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లింపులు ఆగిపోయాయి.

ఎన్నికల కోడ్ ను సాకుగా చూపిస్తూ లబ్ధిదారులపై కక్ష తీర్చుకుంటున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.డీబీటీ నిధులు ఎలక్షన్ కోడ్ వలన అని కాకుండా టీడీపీ కుట్రల వలనే ఆగిపోయాయని లబ్ధిదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ మోకాలడ్డడం వలనే పథకాల చెల్లింపులు కొందరికీ చివరి దశలో నిలిచిపోయాయని తెలుస్తోంది.డీబీటీ పంపిణీపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అమలు చేయనీయకుండా ఈసీపై( EC ) టీడీపీ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై న్యాయస్థానం స్పందిస్తూ.ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరకు నిలుపుదల చేసింది.

Advertisement

దీంతో అర్ధరాత్రి నుంచి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే హైకోర్టు( High Court ) ఇచ్చిన తీర్పును కాపీతో ప్రభుత్వ అధికారులు ఈసీని సంప్రదించారు.

డీబీటీ నగదు జమపై క్లారిఫికేషన్ కోరగా ఈసీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.అయితే ఎన్నికల సంఘం పరిధిలో పని చేస్తున్న నేపథ్యంలో ఈసీ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు చెబుతున్నారు.కానీ పంపిణీకి ఇవాళ ఒక్కరోజు మాత్రమే వెసులుబాటు ఉండటంతో ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యం అయితే న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగిసిపోతుంది.

దీంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుకోవాలని టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.ఇందులో భాగంగానే నవతరం పార్టీ తరపున పరోక్షంగా కోర్టులో అప్పీల్ వేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై ఈసీ స్పందిస్తూ తమకు ఫిర్యాదులు వచ్చాయని, అందుకే పథకాలను నిలిపివేశామని పేర్కొంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...

కాగా గత సంవత్సరం బడ్జెట్ లో నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో డీబీటీ పథకాలకు బటన్ నొక్కి నిధులను విడుదల చేసింది.ఎన్నికల కోడ్( Election Code ) అమల్లోకి రాకముందే సుమారు 70 శాతం నుంచి 80 శాతం మందికి నిధులు జమ అయ్యాయి.మిగిలిన 20 నుంచి 30 శాతం మంది లబ్ధిదారులకు చెల్లింపులు కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయాయి.

Advertisement

అయితే నిజానికి కోడ్ అమల్లోకి రాకముందు నుంచి అమలు అవుతున్న పథకాలకు మరియు బడ్జెట్ లో నిధులు కేటాయించిన పథకాలకు కోడ్ అడ్డురాదని తెలుస్తోంది.కానీ కొత్త లబ్ధిదారులను మాత్రం ఎంపిక చేయకూడదని ఎన్నికల నియమావళి పేర్కొంటుంది.

కానీ టీడీపీ చేసిన కుట్రలతో పాత లబ్ధిదారులకు సైతం నిధులు రాకుండా ఆగిపోయాయి.డీబీటీ పంపిణీ నిలిచిపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

డ్వాక్రా చెల్లింపులు జరగక మహిళలు, విద్యాదీవెన పథకం నిధులు విడుదల కాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.ఏపీలో ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థపై( Volunteer System ) కక్ష గట్టిన టీడీపీ.

పెన్షన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించింది.వృద్ధులు, వికలాంగులు పింఛన్ డబ్బుల కోసం ఎండలో పడిగాపులు పడేలా చేసింది.

ఇక తాజాగా డీబీటీ పథకాలకు సైతం అడ్డుపుల్ల వేసి ప్రజలు అవస్థలు పడేలా చేస్తుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు