'మహానాడు ' కు అడ్డొచ్చారో ... ? వార్నింగ్ ఇచ్చిన బాబు !

నెల 27 28 తేదీలలో ఒంగోలులో జరగబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల్లో ఈ మహానాడు నిర్వహణ చేపట్ట లేకపోవడంతో.

ఇప్పుడు జరగబోయే మహానాడును ఈ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉండడం తో  భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు .అయితే వైసీపీ ప్రభుత్వం ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి అనేక ఆంక్షలు విధించడం.తదితర వ్యవహారాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా స్పందించారు.

     టిడిపి మహానాడు జన సమీకరణ చేపట్టకుండా రవాణాశాఖ అధికారుల ద్వారా వాహనాలను ఎవరు ఏర్పాటు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని కొంతమంది నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా ఆయన ఘాటుగా స్పందించారు. అధికారులు ఏమి అధికార పార్టీ నేతల ప్రైవేటు ఉద్యోగులు కాదు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు-సమావేశాలు పెట్టుకునే హక్కు ఉంది.జగన్ ఏడాది పాటు పాదయాత్ర చేశారు.

Advertisement

అప్పుడు మనం ఇలాగే చేశామా ? అనవసరంగా మనల్ని రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.వాళ్ల బస్సు యాత్రను మన శ్రేణులు అడ్డుకోలేవా ? అదే గట్టిగా చెప్పండి.అధికారులు ఎవరైనా అతి చేస్తే వారిని గుర్తుపెట్టుకుంటాం .అధికారులైన ప్రభుత్వంలోని వారైనా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటూ చంద్రబాబు హెచ్చరించారు.   

  తన రాయలసీమ పర్యటనలో కనీసం బందోబస్తు కూడా చేయకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన మహానాడు ఆగదని దానిని ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు.వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో  వ్యతిరేకత పెరుగుతోందని, ఈ వ్యతిరేకత ప్రభంజనం మహానాడు సమావేశాల్లో కనిపించబోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  ప్రస్తుతం మహానాడు ఏర్పాట్లపైనే చంద్రబాబు, ఆ పార్టీ కీలక నాయకులంతా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు