ఎంత మంది చెప్పిన వినక ఫలితం అనుభవించాను : భరద్వాజ

1979 లో వచ్చిన వేటగాడు సినిమా పేరు ను ఆధారంగా చేసుకొని తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాత గా, రాజశేఖర్ హీరో గా అదే పేరు తో వచ్చిది వేటగాడు మూవీ.

సీనియర్ ఎన్టీఆర్ హీరో గా వచ్చిన మొదటి వేటగాడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలుసు.

కానీ రాజశేఖర్ హీరో గా వచ్చిన మరొక వేటగాడు మాత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.ఈ సినిమా లో తొలుత భరద్వాజ్ గారు శ్రీకాంత్ ని హీరో గా పెట్టుకోవాలని అనుకున్న కొన్ని కారణాల చేత రాజశేఖర్ కి ఆ సినిమాలో పని చేసే అవకాశం వచ్చింది.

అయితే ఈ సినిమా పరాజయానికి మాత్రం కారణం రాజశేఖర్ అంటూ కొన్నేళ్ల క్రితం తమ్మారెడ్డి భరద్వాజ మీడియా కు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.అంతే కాదు ఈ సినిమా కోసం రాజశేఖర్ అస్సలు సహకరించక పోవడం తోనే అలాంటి పరిస్థితి వచ్చిందని, అందుకే సినిమా వల్ల దాదాపు రోడ్ మీద పడ్డంత పని అయ్యిందని చెప్పారు.చాల మంది రాజశేఖర్ తో సినిమా అంటే వద్దు అని ముందే చెప్పారని కానీ వినకపోవడం వల్లనే ఫలితం అనుభవించాను అని కూడా తెలిపారు.

ఇక ఈ సినిమా పరాజయం పాలివ్వడానికి నిర్మాతగా అయన కారణాలు ఆయనకు ఉన్న చాల మంది అభిమానులు మాత్రం హిందీ సినిమాను మక్కికి మక్కి దించడం వల్లనే జనాలు అంతగా ఆదరించలేకపోయారని అంటూ ఉంటారు.

Advertisement

ఇక కొన్నాళ్ల తర్వాత తన సినిమాకు రాజశేఖర్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వలేక పోవడం తో తాను అతడికి ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వలేదని కూడా తమ్మారెడ్డి ఒప్పుకున్నారు.ఇక ఇప్పటికి ఆ డబ్బులను ఇవ్వలేదని, సినిమా విడుదల అయ్యాక విజయం సాదించకపోవడం వల్లనే అతడికి డబ్బులు ఎగ్గొట్టానని స్ప్రష్టం చేసారు అయన.మరో వైపు తనను మొదట హీరో అని చెప్పి చివరి నిముషం లో తప్పించడం పట్ల హీరో శ్రీకాంత్ చాల ఫీల్ అయ్యారట.ఎందుకంటే వేటగాడు సినిమాలో హీరో కి హీరోయిన్స్ గా సౌందర్య తో పాటు రంభ కూడా ఉండటం తో వారి పక్కన తాను నటించే అవకాశం కోల్పోయాను అంటూ అఖండ సినిమా టైం లో చెప్పారు.

కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు