నమ్ముకుంటే ముంచేశారుగా.. ఇంతమంది టాలీవుడ్ హీరోలకు కోలీవుడ్ స్టార్స్ వల్ల షాక్?

ఈ మధ్యకాలంలో చాలామంది టాలీవుడ్( Tollywood ) హీరోలు తమిళ్ డైరెక్టర్ లను నమ్ముకుని చాలా సందర్భాలలో దారుణమైన ఫలితాలను చవిచూసిన విషయం తెలిసిందే.

పవన్, బాలకృష్ణ, మహేష్ ( Pawan, Balakrishna, Mahesh )లాంటి స్టార్ హీరోలతో కొందరు యువ హీరోలకు కూడా తమిళ డైరెక్టర్ల వల్ల డిజాస్టర్ చిత్రాలు పడ్డాయి.

పవన్ కళ్యాణ్ కి తప్పనిసరిగా హిట్ అవసరం అనుకుంటున్న సమయంలో తమిళ డైరెక్టర్ విష్ణు వర్ధన్ పంజా చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ మూవీ దారుణంగా నిరాశపరిచింది.

విష్ణు వర్ధన్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు అనే చిన్న సంతృప్తి తప్ప ఫ్యాన్స్ కి ఇంకేమి మిగలలేదు.అలాగే సౌత్ లో అగ్రదర్శకులలో మురుగదాస్( Murugadoss ) ఒకరు.ఆయన ప్రతిభని శంకించలేం.

కానీ తెలుగులో మాత్రం ఆయనకి ఎందుకో కలసి రావడం లేదు.చిరంజీవితో తెరకెక్కించిన స్టాలిన్ ( Stalin )చిత్రం యావరేజ్.

Advertisement

మహేష్ బాబుతో భారీ హిట్ కొడతాడు అనుకుంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.అలాగే మహేష్ కెరీర్ లోనే భారీ నష్టాలు మిగిల్చిన చిత్రం స్పైడర్.

అలాగే లింగుస్వామి చిత్రాలు డీసెంట్ గా ఉంటాయి.

కానీ రామ్ పోతినేనితో( Ram Pothineni ) తెరకెక్కించిన వారియర్ చిత్రం వర్కౌట్ కాలేదు.రొటీన్ టెంప్లేట్ లో తెరకెక్కించిన చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు.పవన్ తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించడంతో డైరెక్టర్ ఎస్ జె సూర్యకి మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో ఎస్ జె సూర్య చేసిన సైంటిఫిక్ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది.మహేష్ ఇమేజ్ కి ఈ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు.వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ వెంకట్ ప్రభు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

నాగ చైతన్యతో వెంకట్ ప్రభు పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు.కస్టడీ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది.

Advertisement

తాజా వార్తలు