ఎన్టీఆర్‌ సినిమాలో మిల్కీ బ్యూటీ?

నందమూరి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’.ఈ సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్‌ 25వ సినిమా అవ్వడంతో నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు.ఎక్కడ కూడా కాంప్రమైజ్‌ కాకుండా దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఇదే సినిమాలో తమన్నా కూడా కనిపించబోతుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో తమన్నా ఒక ఐటెం సాంగ్‌లో స్టెప్పులు వేసేందుకు సిద్దంగా ఉందని, అందుకోసం భారీ మొత్తంలో తమన్నా పారితోషికాన్ని తీసుకుంటుందంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన స్టైల్‌లో ఒక అదిరి పోయే ఐటెం సాంగ్‌ను ట్యూన్‌ చేశాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

భారీ అంచనాలున్న ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్‌ చేస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగి పోతున్నాయి.రేపు వినాయక చవితి సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు