చైనాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమ పెట్టాల్సిందిగా అక్కడి పెట్టుబడిదారులను ఆహ్వానించారు.తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పెట్టుబడిదారులతో కాకుండా దేశీయ సెల్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఆంధ్రాలో పరిశ్రమలు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.తక్కువ ఖర్చుతో సెల్ ఫోన్లు తయారు చేస్తున్న భారతీయ కంపెనీలైన మైక్రోమాక్‌్స, సెల్‌కాన్, కార్బన్ కంపెనీలతో ఆంధ్రాలో యూనిట్లు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
ఈ మూడు పరిశ్రమలు తిరుపతిలో ఏర్పాటవుతాయి.తిరుపతిని మొబైల్ ఫోన్‌ల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నారు.
ఏపీలో వచ్చే ఏడాది నాటికి అరవై నుంచి డెబ్బయ్ లక్షల మొబైల్ ఫోన్లు తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఏపీకి మూడె మొబైల్ తయారీ పరిశ్రమలు రావడం రాష్ర్టంలో ఎలక్ర్టానిక్‌్స పరిశ్రమ విస్తరణకు దోహదం చేస్తుందని బాబు భావిస్తున్నారు.
ఈ మూడు సెల్ ఫోన్ తయారీ కంపెనీల కంటే ముందు గ్జియోమీ కంపెనీ ఏపీలోకి అడుగుపెట్టింది.ఏపీలోకి నాలుగు మొబైల్ కంపెనీలు ప్రవేశించడం పట్ల బాబు సంతోషంగా ఉన్నారు.
కేసీఆర్ చైనా పర్యటన ఫలితంగా తెలంగాణకు ఎంత మేలు జరుగుతుందో, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయో ఇప్పుడే చెప్పలేం.తన చైనా పర్యటన వివరాలను కేసీఆర్ వెల్లడించాల్సి ఉంది.
తమది ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానమని కేసీఆర్ చైనాలో చెప్పారు.ఇతర దేశాల్లో ఇదే మాట చెప్పారు.
స్వదేశీ పారిశ్రామికవేత్తలకూ వివరించారు.కాని ఇప్పటివరకు ఒక్క పెద్ద పరిశ్రమ కూడా తెలంగాణకు రాలేదు.
దేశీయ బడా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తాము తెలంగాణలో పెట్టుబడులు పెడతామని ప్రకటించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి మాట్లాడారు.
కాని వారు ఇప్పటివరకు అడుగులు వేసిన దాఖలాలు లేవు.







