రైతుల చావులను ఎగతాళి చేస్తున్నారు.. తాప్సీ కీలక వ్యాఖ్యలు..?

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మిడిల్ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ.

తెలుగులో అవకాశాలు తగ్గిన తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీకి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో కంగనా గురించి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన తాప్సీ పన్ను తాజాగా రైతుల చావుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.రైతు నిరసనల్లో 200 మంది రైతులు మృతి చెందగా హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ రైతుల చావుల గురించి మాట్లాడుతూ రైతులు ఇంట్లో ఉన్నంత మాత్రాన చనిపోకుండా ఉంటారా.? లక్షల మంది జనాభాలో 200 మంది రైతులు చనిపోరా.? రైతులు వారి ఇష్టపూర్వకంగానే చనిపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

నటి తాప్సీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల గురించి స్పందిస్తూ మనుషుల జీవితాలకు విలువ పోయిందని అన్నారు.రైతులు మన ఆకలిని తీరుస్తున్నారని.ఆకలి తీర్చే రైతుల యొక్క జీవితాలను విలువ పోయిందని పేర్కొన్నారు.

రైతుల చావులను ఎగతాళి చేస్తున్నారంటూ మంత్రి వ్యాఖ్యలపై తాప్సీ పన్ను ఘాటుగా స్పందించారు.మంత్రి వ్యాఖ్యలపై తాప్సీ పన్ను తన ట్వీట్ ద్వారా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో దలాల్ కామెంట్ల విషయంలో వెనక్కు తగ్గారు.రైతుల గురించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు కోరుతున్నానని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతుండగా రైతులు మాత్రం కొత్త వ్యవసాయ చట్టాల వల్ల నష్టపోతామని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు