నోయిడాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.నాలుగేల్ల బాలుడిని కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల దగ్గర నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు కాజేయాలనుకున్నారు.
తర్వాత ఆ బాలుడుని ఎక్కడ దాచి పెట్టాలో తెలియక దారుణంగా చంపేసి చెత్త కుప్పలో పడేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
నోయిడా సమీపంలో సురాజపూర్ గ్రామానికి చెందిన చెందిన హృతిక్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు ఉన్నాడు.ఇంట్లో అందరి కంటే చిన్నవాడు కావడంతో అతడి తల్లిదండ్రులు గారాబంగా పెంచుకుంటున్నారు.
ఇద్దరు యువకులు ఆ బాలుడిపై కన్నేసి అతడిని కిడ్నాప్ చేయాలనుకున్నారు.ఆ బాలుడు వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బైకుపై వచ్చిన ఆ యువకులు బిస్కెట్స్ ఇస్తామని ఆశపెట్టి ఆ బాలుడ్ని కిడ్నప్ చేసారు.
ఆడుకుంటున్న బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు.పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేసారు.హృతిక్‌ను కిడ్నాప్ చేసిన యువకులకు ఆ తర్వాత అతడిని ఎక్కడ ఉంచాలో అర్ధం కాలేదు.ఇంతలో పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని సమాచారం అందింది.
పోలీసులు వస్తే దొరికిపోతామని ఆ బాలుడు ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు.తర్వాత చెత్తకుప్పలో పడేసి అక్కడి నుండి పారిపోయారు.తర్వాత పోలీసులు అందులో ఒక యువకుడిని అరెస్ట్ చేసారు.అతడు నేరాన్ని అంగీకరించి ఆ బాలుడుని ఎక్కడ పడేశారో చూపించాడు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కుళ్లిపోయిన స్థితిలో బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
చనిపోయే ముందు హృతిక్ ఒక చేతిలో బిస్కేట్ పట్టుకుని ఉన్నాడు.ఈ ఘటన ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించింది.
పోలీసులు సకాలంలో స్పందించి ఉంటె మా బాలుడు బ్రతికేవాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.రెండో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.







