లలిత్ మోడీకి బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్.. అసలు కారణం ఏంటంటే?

బాలీవుడ్ ప్రముఖ నటి మాజీ విశ్వసుందరి అయినా సుస్మితా సేన్ మీరు మొన్నటి వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించింది.

సుస్మిత సేన్ ఐపిఎల్ ఫౌండర్ లలిత మోదీ ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

కొద్దిరోజులపాటు ఈ వార్త సోషల్ మీడియాలో తెలతెక్కర్లు కొట్టడంతో పాటు ఈ జంట తెగ వైరల్ అయ్యారు.ఆ తర్వాత మళ్లీ వీరి పేర్లు సోషల్ మీడియాలో పెద్దగా వినిపించలేదు.

ఇకపోతే సుస్మిత వయసు 46 ఏళ్ళు అయినా కూడా ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని జీవితం కొనసాగిస్తోంది.నటిగా తెలుగు, తమిళం, హిందీ భాషల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ, సుష్మిత తో కలిసి దిగిన ఒక ఫోటోని పంచుకుంటూ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లుగా తెలిపిన విషయం తెలిసిందే.నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని అంటూ ట్వీట్ చేసారు.

Advertisement

పెళ్లి చేసుకోవడం లేదు కానీ డేటింగ్ చేస్తున్నాము అంటూ వారు క్లారిటీ ఇచ్చారు.ఇది ఇలా ఉంటే అభిమానులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంపై అటు సుస్మిత కానీ ఇటు లలిత్ కానీ ఇంతవరకు స్పందించలేదు.కానీ సోషల్ మీడియా యూజర్లు, లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మార్పుల్ని గుర్తించారు.

అందులో లలిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి సుస్మిత పేరును తొలగించారు.అంతేకాదు ఆమెతో కలిసి ఉన్న ఫోటోకు సంబంధించిన డీపీ కూడా మార్చేశారు.

దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని,గతంలో సుస్మిత తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన లలిత్ మోడీ ఇలా సడన్‌గా డీపీ మార్చేయడంతో ఆమెతో బ్రేకప్ అయ్యిందంటున్నారు నెటిజన్లు.  అదే సమయంలో సుస్మిత సేన్ ఈ మధ్య తన మాజీ ప్రియుడు రోహ్మాన్‌తో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో సుస్మిత, లలిత్ బ్రేకప్ లకి కారణం తన మాజీ ప్రియుడే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే సుస్మిత సేన్ కానీ లలిత మోడీ కాని స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు