ఏపీలో సర్జికల్ స్ట్రైక్ ? బీజేపీ  అత్యాశ ?

పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడతాం అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, మరి కొంతమంది నాయకులు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో పాటు, బీజేపీకి అనూహ్యంగా మైలేజ్ ఇచ్చాయి.

ఊహించిన దానికంటే గ్రేటర్ ఎన్నికలలో విజయాన్ని సాధించి పెట్టింది.

ఇప్పుడు అదే సర్జికల్ స్ట్రైక్ పదాలను ఉపయోగించి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో విజయం సాధించాలని ఏపీ బీజేపీ నాయకులు డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు.ఒక్కసారిగా బిజెపికి ఇక్కడ ఊపు తీసుకురావడం ద్వారా, ఇక్కడ సులభంగా గెలవడం అనేది బిజెపి నాయకులు ఆలోచనగా కనిపిస్తోంది.

దీనికోసం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉపయోగించిన రూట్ లోనే వెళ్లాలని ఏపీ బీజేపీ నాయకులు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తున్నారు.బిజెపి రాజ్యసభ సభ్యుడు ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

<\br>ఏపీలో హిందుత్వాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా, హిందువుల అందరినీ ఏకం చేసి, బిజెపి సత్తా చాటుకోవాలని చూస్తోంది.దీనిలో భాగంగానే సర్జికల్ స్ట్రైక్ అస్త్రాన్ని బయటకు తీసినట్టుగా కనిపిస్తోంది.

Advertisement

కాకపోతే తెలంగాణలో బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలకు జీవీఎల్ నరసింహారావు చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలకు సంబంధం లేదన్నట్టు గానే ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది.అసలు ఇక్కడ అటువంటి మాటలను ఉపయోగించినా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదనేది బిజెపి పెద్దలకు తెలియంది కాదు.

తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఇప్పుడు ఎదిగింది.కాంగ్రెస్ బలహీనం కావడం కూడా కలిసి వచ్చింది.

<\br>కానీ ఏపీలో వైసీపీ తో పాటు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది.ఇక్కడ అధికారం దక్కించుకోవాలంటే వైసిపి, టిడిపి రెండు పార్టీలను బలహీనపరిస్తేనే బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

కానీ బిజెపి కి ఏపీలో అధికారం దక్కించుకునే అంత స్థాయిలో బలం లేదు.క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలహీనంగా ఉండడమే దీనికి కారణం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

కానీ ఇవేమీ ఆలోచించకుండానే ఏపీ బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ పైన, టీడీపీలపైనా సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ, జనాలలోనూ గందరగోళం సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. తెలంగాణ మాదిరిగా ఏపీలో సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా, బీజేపీని జనాల్లోకి తీసుకువెళ్లాలి అనేది ప్లాన్ గా కనిపిస్తోంది.

Advertisement

కానీ దానికి ఇది సరైన రూట్ కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణలో హిందుత్వ వాదం బలంగా ఉంది.అక్కడ ఎంఐఎం, టీఆర్ఎస్ దూకుడు కు అడ్డుకట్ట వేయాలంటే హిందూయిజం ను రెచ్చగొట్టడం, బిజెపికి ఉన్న ఏకైక ఆప్షన్.కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

ఇక్కడ పూర్తిగా తెలంగాణ వాతావరణానికి విరుద్ధం.అయినా నేల విడిచి సాము చేసినట్టుగా వ్యవహరిస్తున్న తీరుతో మొదటికే మోసం వచ్చే లా కనిపిస్తోంది.

తాజా వార్తలు