నేను సేఫ్ గా ఉన్నాను.. ఎవరూ టెన్షన్ పడొద్దు.. సుప్రీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖావాణి( Surekha Vani ) కూతురుగా సుప్రీత( Supritha ) తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సుప్రీత ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

అమర్ దీప్ చౌదరి హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో సుప్రీత హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై పరవాలేదనే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.తాజాగా రిలీజ్ చేసిన ఒక వీడియోలో సుప్రీత తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్ ను( Betting App ) ప్రమోట్ చేశానని పేర్కొన్నారు.

దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయొద్దని మీరు కూడా వాటికి దూరంగా ఉండాలంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.గత కొన్నిరోజులుగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సుప్రీతపై కూడా కేసు నమోదైందని పోలీసులు నోటీసులు జారీ చేశారని వార్తలు వినిపించాయి.

Surekhavani Daughter Supritha Shocking Comments Goes Viral In Social Media Detai
Advertisement
Surekhavani Daughter Supritha Shocking Comments Goes Viral In Social Media Detai

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి సుప్రీత రియాక్ట్ అయ్యారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని సుప్రీత పేర్కొన్నారు.అవన్నీ ఫేక్ అని ఆమె తెలిపారు.

ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నానని సుప్రీత వెల్లడించారు.సుప్రీత వీడియోలో అందరికీ నమస్కారం అని తనపై వస్తున్న వార్తలన్నీ అబద్ధాలు అని ఆమె పేర్కొన్నారు.

Surekhavani Daughter Supritha Shocking Comments Goes Viral In Social Media Detai

ప్రస్తుతం నేను షూటింగ్ లో ఉన్నానని మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని థాంక్యూ సో మచ్ అని వెల్లడించారు.అయితే పోలీసులు ఇప్పటికే పలువురు ఇన్ ఫ్ల్యూయెన్సర్లను విచారిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.సుప్రీతపై నమోదైన కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

హీరోతో డేట్ చేయకూడదని షరతు విధించారు.. నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు