పుష్ప సినిమాలో సునీల్ రోల్ అలా ఉండనుందట!

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.

ఈ సినిమాలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రష్ బ్యూటీ రష్మిక మందన లు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

గతంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా ప్రస్తుతం మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా అక్రమ రవాణా గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కనుంది.పైగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాను అన్ని భాషల్లో తెరకెక్కించనున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయని తెలుస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఇందులో యాంకర్ అనసూయ, స్టార్ కమెడియన్ సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇందులో సునీల్ అనసూయకు భర్తగా నటించనున్నట్లు తెలియగా ఇందులో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడట.అంతేకాకుండా అనసూయ కూడా లేడీ విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సునీల్ కమెడియన్ గా కాకుండా హీరోగా కూడా మెప్పించాడు.

టీవలే కలర్ ఫోటో సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమాలో మొదటి భాగం మొత్తం మెయిన్ విలన్ గా సునీల్ కనిపించనున్నాడట.

మొత్తానికి సునీల్ అన్ని పాత్రలతో మెప్పిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర లో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో పూర్తయిన వెంటనే గోవాలో అల్లు అర్జున్, రష్మిక మందన ల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.ఇక దాదాపు గోవాలో 15 రోజులు షెడ్యూల్ ఉండటంతో మొత్తానికి ఈ సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు