ఆ స్టార్ కొరియోగ్రాఫర్ కు సుకుమార్ చుక్కలు చూపించారా.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు సుకుమార్( Director Sukumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా( Pushpa Movie ) విడుదల అయ్యి పాన్ ఇండియా సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమాతో సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది.ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది.

ఇకపోతే టాలీవుడ్ దర్శకుల్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌లుగా పేరున్న వాళ్లలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు.తనకు కావాల్సిన ఔట్ పుట్ కోసం ఆయన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎంత కష్టపెడతారో కథలు కథలుగా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో.

జక్కన్న తర్వాత ఆ స్థాయిలో తన టీం సభ్యులను సతాయించేది సుకుమారే.

Sukumar Tortured Choreographer Ganesh Acharya, Sukumar, Choreographer, Tollywoo
Advertisement
Sukumar Tortured Choreographer Ganesh Acharya, Sukumar, Choreographer, Tollywoo

పని రాక్షసుడిగా పేరున్న సుకుమార్.రైటింగ్ దగ్గర్నుంచి మేకింగ్ వరకు ఏ విషయంలోనూ ఒక పట్టాన సంతృప్తి చెందరట.ఆయన స్క్రిప్టు ఏ దశలోనూ లాక్ కాదు.

సెట్స్‌లో అప్పటికప్పుడు సన్నివేశం మార్చేస్తారు.డైలాగ్స్ కొత్తగా రాయిస్తారని ఎన్టీఆర్ సహా చాలామంది సెలబ్రిటీలు చెప్పారు.

ఇకపోతే మేకింగ్ టైంలో సెట్స్‌లో ఎంతమంది ఉన్నా, ఎంత టైం పట్టినా ఆయన కోరుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు రాజీపడరట.పేరున్న టెక్నీషియన్లు సైతం సుకుమార్ దెబ్బకు బెంబేలెత్తిపోతుంటారని అంటూ ఉంటారు.

పుష్ప-2( Pushpa 2 ) మీద ఉన్న భారీ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ తన టీంతో కలిసి మామూలుగా కష్టపడట్లేదు.ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వడం కోసం ఆయన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను మామూలుగా సతాయించట్లేదట.

Sukumar Tortured Choreographer Ganesh Acharya, Sukumar, Choreographer, Tollywoo
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఆయన దెబ్బకు దేశంలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడైన గణేష్ ఆచార్య( Choreographer Ganesh Acharya ) కూడా బెంబేలెత్తిపోయినట్లు సమాచారం.సినిమాలో అత్యంత కీలకమైన గంగ జాతర ఎపిసోడ్లో వచ్చే పాటకు గణేషే నృత్యరీతులు సమకూర్చాడు.రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో కొన్ని వారాల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగిందట.

Advertisement

ఈ పాట కోసం కొన్ని వారాల పాటు పని చేశాడట గణేష్.ఆయన కెెరీర్లోనే అత్యధిక రోజులు పని చేసిన పాటల్లో ఇదొకటని సమాచారం.ముందు అనుకున్న కాల్ షీట్స్ కంటే రెండు మూడు రెట్లు కేటాయించాల్సి వచ్చిందట.

కేవలం గణేష్ ఆచార్య ఒక్కడి పారితోషకం కోట్లల్లోకి వెళ్లిపోయిందట.స్టెప్పులు మార్చి మార్చి కంపోజ్ చేయడం, షూట్ దగ్గర బాగా ఆలస్యం జరగడంతో గణేష్ ఆచార్య ఇదెక్కడి పర్ఫెక్షనిజం అంటూ తల పట్టుకున్నాడట గణేష్.

తాజా వార్తలు