Sukumar Ram Charan : సుకుమార్ నెక్స్ట్ సినిమా ఫిక్స్.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

లెక్కల మాస్టారు సుకుమార్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం అనే చెప్పాలి.

ఈయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అప్పటి వరకు రొటీన్ సినిమాలను చేసుకుంటూ పోతున్న రామ్ చరణ్ కు రంగస్థలం వంటి బాక్సాఫీస్ హిట్ ఇచ్చాడు.ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచి పోయింది.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ పుష్ప సినిమా చేసాడు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా పుష్ప ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు.

ఈ సినిమాతో సుకుమార్ మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాతో తనని తాను మరోసారి నిరూపించు కున్నాడు.

Advertisement

పాన్ ఇండియా రేంజ్ లో ఈయన పేరు మారుమోగి పోయేలా సుక్కూ చేసుకున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 మీద తన ధ్యాస మొత్తం పెట్టేసాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి.త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ఇప్పుడు ఈయన లైనప్ గురించి ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది.ఈయన మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే సినిమా చేయబోతున్నాడు అనే టాక్ గత కొన్ని రోజుల నుండి వినిపిస్తూనే ఉంది.

రామ్ చరణ్ ప్రెజెంట్ తన 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

ఇక 16వ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించారు.కానీ ఈ సినిమా ఆగిపోయింది అంటూ అనౌన్స్ చేసారు.దీంతో నెక్స్ట్ చరణ్ సుకుమార్ ను లైన్లో పెట్టుకున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

ఈ ప్రాజెక్ట్ రాబోతుంది అంటే ఇండియన్ సినిమా దగ్గర గేమ్ చేంజర్ గా ఉంటుంది అని బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని సినీ వర్గాల్లో చర్చించు కుంటున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ నిర్మించడానికి రెడీ అయ్యారు అని తెలుస్తుంది.

దీంతో ఈ క్రేజీ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు