రికార్డులు బద్దలగొడతాం.. జోష్‌లో ఉన్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్

తెలుగు బుల్లితెరపై తన టాలెంట్ ను నిరూపించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్టిస్టు ఎవరంటే సుడిగాలి సుధీర్ అని ఇట్టాగే చెప్పవచ్చు.

సుదీర్ఘకాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్న జబర్దస్త్ షో తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

నిజానికి ఈయనకు ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉందంటే నమ్మాల్సిందే.జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.

అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.నిజానికి కెరీర్ మొదట్లో సుధీర్ మ్యాజిక్ లు చేసేవాడు.

అలా పలు షోలలో మ్యాజిక్ లు చేసి జబర్దస్త్ దృష్టిలో పడ్డాడు.ఇక జబర్దస్త్ తో సుధీర్ కెరీర్ మొత్తం మారిపోయింది.

Advertisement
Sudheer Fans Excited To Watch Sudigali Sudheer Engagement In Sridevi Drama Compa

అలా జబర్దస్త్ లో యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతూ అందరి దృష్టిలో పడ్డాడు.అలా ఈ షో లో వీరిద్దరి మధ్య జరిగే పెర్ఫార్మెన్స్ బాగా సందడిగా ఉంటుంది.

ఈ షో ద్వారా వెండితెరపై అవకాశం అందుకున్నాడు.పలు సినిమాలలో సహాయ పాత్రల్లోనూ నటించాడు.

అంతేకాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

Sudheer Fans Excited To Watch Sudigali Sudheer Engagement In Sridevi Drama Compa

అటు వెండి తెరపై, ఇటు బుల్లితెరపై సుధీర్ కు బాగా కలిసొచ్చింది.ఆ తర్వాత బుల్లి తెర పై కమెడియన్ గానే కాకుండా యాంకర్ గా కూడా అడుగు పెట్టాడు.గతంలో పోవే పోరా అనే షో తో యాంకర్ గా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

ఇక ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లో టీం లీడర్ గా చేశాడు.గత కొంత కాలం నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా చేసి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Advertisement

సుధీర్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటాడు.ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నిజానికి ఈయనకు ఉన్న అభిమానం మాత్రం మాటల్లో చెప్పలేనిది.చాలామంది ఈటీవీ లో ప్రసారమయ్యే పలు షోలను సుధీర్ కోసమే చూస్తుంటారు.

ఇక సుధీర్ కు అమ్మాయిల వీక్నెస్ ఉంటుందని ఆయన షో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు.అలా ఏ షోలో నైనా సుధీర్ ను అమ్మాయిల విషయంలో బాగా ఆట పట్టిస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

అందులో సుధీర్ కోసం ఇంద్రజ నాలుగు సంబంధాల ను తీసుకొచ్చి తెగ హడావుడి చేసింది.మొత్తానికి సుధీర్ పెళ్లిచూపులు కూడా జరగటంతో ప్రోమో బాగా హైలెట్ గా మారింది.

అందులో సుధీర్ పర్ఫామెన్స్ కు మాత్రం ఆయన అభిమానులు మరోసారి ఫిదా అయ్యారు.ఇన్ని రోజులు ఒక లెక్క ఈ ఎపిసోడ్ ఒక లెక్క.ఇక రికార్డు బద్దలు కొడతాం అంటూ సుధీర్ ఫ్యాన్స్ తెగ జోష్ లో కనిపిస్తున్నారు.

తాజా వార్తలు