Nandamuri Balakrishna : బాలయ్య ఈ వయసులోనూ హ్యాట్రిక్ హిట్స్ సాధించడానికి కారణం అదేనా…?

సినిమా ఫీల్డ్‌లో దశాబ్దాలుగా హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో మనుగడ సాగించడం అంత సులభమేమీ కాదు.

ముఖ్యంగా హీరోలు సినిమా కథ నుంచి ప్రజెంటేషన్ వరకు అన్ని చూసుకోవాలి.

అంతేకాదు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులను కూడా తెలుసుకొని వారికి నచ్చేలా సినిమాలు తీయాల్సి ఉంటుంది.లేదంటే వరుసగా ఫ్లాప్స్ వచ్చి ఇండస్ట్రీ నుంచి తెరమరుగు కావాల్సిన పరిస్థితి వస్తుంది.

అయితే పక్కా ప్లానింగ్ తో ఇప్పటికీ వరుసగా హిట్స్ కొడుతున్న టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు ఉన్నారు.ఆయన మరెవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ.( Nandamuri Balakrishna )

అఖండ,( Akhanda ) వీర సింహారెడ్డి,( Veerasimha Reddy ) భగవంత్‌ కేసరి( Bhagavanth Kesari ) సినిమాలతో బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు.ఈరోజుల్లో వరుసగా రెండు సక్సెస్ లు అందుకోవడానికి కుర్ర హీరోలే కష్టపడుతున్నారు.అలాంటిది 63 ఏళ్ల వయసులో అంటే దాదాపు రిటైర్ అయిన వయసులో బాలకృష్ణ అఖండ విజయాలను సాధించి అందర్నీ తన వైపు తిప్పుకున్నాడు.

Advertisement

మరి ఈ వయసులో కూడా కుర్ర హీరోల కంటే ఎక్కువ క్రేజ్‌, హిట్స్‌తో దూసుకెళ్తున్న బాలయ్య బాబు సీక్రెట్ ఏంటి? అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు.బాలయ్యను చూసి నేర్చుకోవాలని యంగ్ హీరోలకు సలహాలు కూడా ఇస్తున్నారు.

బాలకృష్ణ సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ అతను తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవడమే అని చెప్పుకోవచ్చు.అలానే అభిమానులు తన సినిమాలు నుంచి ఎలాంటి కథలు, ఫైట్లు కావాలనుకుంటున్నారు? అనేది బాలకృష్ణ ఎప్పుడూ తన మైండ్ లో ఉంచుకుంటాడు.దాని ప్రకారమే సినిమాలు తీసుకుంటూ వెళ్తాడు.

కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా మిగతా అన్ని సందర్భాల్లో విజయాలను సాధిస్తూనే ఉంటాడు.బాలయ్య తీసే సినిమాలు( Balayya Movies ) ప్రేక్షకులను బాగా హత్తుకుంటుంటాయి.

అలాంటి కథలను ఎంచుకునే టాలెంట్ బాలయ్యకి తప్ప మరెవ్వకీ లేదని చెప్పుకోవచ్చు.ఈ సీక్రెట్స్ మిగతావారు ఫాలో అవుతే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

బాలకృష్ణ ఒకేసారి చాలా సినిమాలు చేయడానికి ఇష్టపడడు.ఒక్కో సినిమా పూర్తి శ్రద్ధతో పూర్తి చేస్తూ ఫుల్ డెడికేషన్ ఇస్తాడు.తనతో కలిసి పని చేయగల దర్శకులతో మాత్రమే సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు.

Advertisement

ఒక సినిమాలో చేసిన తప్పు మరో సినిమాలో చేయడానికి అసలు ఇష్టపడడు.ప్రతి సినిమా నుంచి ఏదో ఒక తప్పు నేర్చుకుంటాడు.హ్యాట్రిక్ హిట్స్ సాధించాక ఇప్పుడు బాలకృష్ణ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు రూ.30 కోట్లకు చేరిందని సమాచారం.సీనియర్ హీరోలకు ఈ అమౌంట్ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు