సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు.ఈ క్రమంలోనే ఈనెల 9వ తేదీ లోపు సెన్సార్ బోర్డు కమిటీ రివ్యూ రిపోర్టు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వ్యూహం ( vyuham ) చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.
నాలుగు వారాల్లో మళ్లీ సెన్సార్ బోర్డు రివ్యూ ( Censor Board Review )చేసి రిపోర్ట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ప్రకటించింది.అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది.దీంతో పిటిషన్ పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఈ నెల 9 లోగా సెన్సార్ బోర్డు కమిటీ రివ్యూ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.