స్టిక్కర్ పై స్టిక్కర్: ఏపీలో పొలిటికల్ వార్ ! 

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య స్టిక్కర్ వార్ హోరా హోరీగా సాగుతోంది .ఒకరికి పోటీగా మరొకరు ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఒకరి స్టిక్కర్ పై మరొకరు స్టిక్కర్ అంటిస్తూ ఉండడం ఇప్పుడు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేలా పరిస్థితి మారిపోయింది.

వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, తమ పాలన పై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు వైసిపి 

Sticker On Sticker Political War In Ap ,ysrcp, Jagan, Ap Cm Jagan, Tdp, Janasen

జగనన్నే మా భవిష్య త్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది.2 వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.దీనిలో భాగంగా వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అంతా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు,  వాటి వల్ల ప్రజలకు చేకూరుతున్న లబ్ధి తదితర విషయాలను ప్రజలకు చెప్పడంతో పాటు, వాటిపై జనాల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో పాటు ఆయా ఇళ్లలోని వారి అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను అతికిస్తున్నారు.అయితే ఈ స్టిక్కర్ల అంటింపు వ్యవహారంపై విపక్షాలు వైసీపీపై విమర్శలు చేస్తున్నాయి.

అంతేకాదు మా నమ్మకం జగన్ కు పోటీగా జనసేన , టిడిపిలు పోటాపోటీగా స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి.మా నమ్మకం నువ్వే జగన్ స్పీకర్లకు పోటీగా మాకు నమ్మకం లేదు జగన్ అంటూ జనసేన స్టిక్కర్లు అంటించే కార్యక్రమం కు శ్రీకారం చుట్టగా ,

Sticker On Sticker Political War In Ap ,ysrcp, Jagan, Ap Cm Jagan, Tdp, Janasen
Advertisement
Sticker On Sticker Political War In AP ,YSRCP, Jagan, Ap Cm Jagan, TDP, Janasen

ఇప్పుడు విజయవాడలో టిడిపి నేతలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వైసిపి నేతలు మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో అంటించిన స్టిక్కర్లపై సైకో పోవాలి.సైకిల్ రావాలి అనే స్టిక్కర్లను అంటిస్తున్నారు.

ఈ స్టిక్కర్లపై టిడిపి ఎమ్మెల్యేలు,  ప్రజాప్రతినిధులు చంద్రబాబు ఫోటోలను ముద్రించారు.ఈ వ్యవహారం పై  వైసిపి తీవ్రంగా  స్పందిస్తోంది.

తమ స్టిక్కర్లపై టీడీపీ , జనసేనలు స్టిక్కర్లు అంటించడం సరికాదని, అలాగే కొన్నిచోట్ల ఆ స్టిక్కర్లను చించివేస్తూ ఉండడం పై మండిపడుతోంది.ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు