పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఆరోజే ఈ బ్యూటీ పెళ్లి జరగనుందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh )ఒకరు.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయకపోయినా తెలుగులో ఒకప్పుడు వరుస ఆఫర్లతో రకుల్ సత్తా చాటారు.

అయితే రెండున్నర సంవత్సరాల క్రితం రకుల్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని అధికారికంగా వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత రకుల్ పెళ్లి గురించి కొన్ని వార్తలు వైరల్ కాగా సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.అయితే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా రకుల్ పెళ్లి గురించి వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.ఫిబ్రవరి నెల 22వ తేదీన రకుల్ జాకీ భగ్నానీ( Jackky Bhagnani ) వివాహం జరగనుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

గోవా( Goa )లోని రిసార్ట్ లో రకుల్ జాకీ వివాహం జరగనుందని భోగట్టా.పలు ఆంగ్ల వెబ్ సైట్స్ లో ఇందుకు సంబంధించిన కథనాలు వైరల్ అవుతుండగా ఆ కథనాలు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.

Advertisement

రకుల్ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.వైరల్ అవుతున్న వార్తల గురించి రకుల్ ప్రీత్ సింగ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో రకుల్ పెళ్లి చేసుకోవడం ఒకింత షాక్ కు గురి చేస్తోంది.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం ప్రస్తుతం 2 నుంచి 3 కోట్ల రూపాయలుగా ఉంది.రాబోయే రోజుల్లో రకుల్ ప్రీత్ సింగ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రకుల్ కు ఈ ఏడాది కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు