Nayanthara : సెకనుకు 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్.. ఈ రేంజ్ పారితోషికం నయన్ కే సాధ్యమంటూ?

ఈ మధ్య కాలంలో సినీ తారల పారితోషికాలు( Celebrities Remuneration ) ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఎక్కువ మొత్తం పారితోషికం అందుకునే హీరోయిన్లలో నయనతార( Nayanthara ) ముందువరసలో ఉంటారు.

ఈ హీరోయిన్ పారితోషికం 8 కోట్ల రూపాయలు అని 10 కోట్ల రూపాయలు అని వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తుంటాయి.అయితే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఎక్కువగా ఉన్న హీరోయిన్ కావడంతో పాటు ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కావడంతో నయనతారకు ఈ రేంజ్ లో పారితోషికం దక్కుతోంది.

అయితే పరిమితంగా యాడ్స్ లో నటించే నయనతార ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ యాడ్( Cool Drink Ad ) కోసం 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారు.

Star Heroine Nayanatara Remuneration For Ads Details Here Goes Viral In Social

బ్యూటీ రెమ్యునరేషన్( Nayanthara Remuneration ) సెకనుకు 10 లక్షల రూపాయలుగా ఉంది.50 సెకన్ల నిడివి ఉన్న యాడ్ కోసం ఒక హీరోయిన్ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోవడం చాలా అరుదు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నయనతార క్రేజ్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువేనని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.హీరోయిన్ గా 75 కంటే ఎక్కువ సినిమాలలో నటించిన నయనతార పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటున్నారు.39 సంవత్సరాల వయస్సులో సైతం వరుస ఆఫర్లను అందుకుంటూ నయన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.లేడీ సూపర్ స్టార్( Lady Superstar ) ఇమేజ్ నయనతార రేంజ్ ను మరింత పెంచిందనే చెప్పాలి.

Advertisement
Star Heroine Nayanatara Remuneration For Ads Details Here Goes Viral In Social

వరుసగా యాడ్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ యాడ్స్ ద్వారా క్రేజ్ పెంచుకుంటున్నారు.

Star Heroine Nayanatara Remuneration For Ads Details Here Goes Viral In Social

నయనతార వివాదాలకు దూరంగా ఉండే సినిమాలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జవాన్ సినిమా( Jawan Movie )తో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం నయనతార సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నారు.ఎలాంటి రోల్ ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్న ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు