జబర్దస్త్ షోకు జడ్జిగా బాలకృష్ణ.. షాకవుతున్న నందమూరి అభిమానులు?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో సంవత్సరాలు గడుస్తున్నా మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం.

ఇతర ఛానెళ్లలో కూడా కామెడీ షోలు ప్రసారమవుతున్నా ఆ షోలు జబర్దస్త్ కు గట్టి పోటీ ఇవ్వడంలో ఫెయిల్ కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో విఫలవుతున్నాయి.

తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో రోజా స్టార్ హీరో బాలకృష్ణకు ఫోన్ చేయగా బాలకృష్ణ రోజాతో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అనసూయ  రోజాతో ఈరోజు బాలయ్య బాబుగారికి కాల్ చేయాలని చెప్పగా రోజా బాలయ్య బాబు మంచి మూడ్ లో ఉంటే ఓకే లేదంటే అంటూ కామెంట్లు చేస్తారు.ఆ తర్వాత రోజా బాలకృష్ణకు కాల్ చేయగా బాలకృష్ణ రోజాగారు నమస్కారం అని చెబుతాడు.

రోజా బాగున్నారా అని అడగగా బాగున్నానని బాలయ్య సమాధానం ఇస్తాడు.

Star Hero Balakrishna Comments About Jabardasth Show, Balakrishna Comments , Com
Advertisement
Star Hero Balakrishna Comments About Jabardasth Show, Balakrishna Comments , Com

మీరెలా ఉన్నారని బాలకృష్ణ అడగగా బాగున్నాను సార్ అని రోజా సమాధానం ఇస్తారు.నేను జబర్దస్త్ లో ఉన్నానని రోజా చెప్పడంతో పాటు మీరేం చేస్తున్నారని బాలయ్యను అడగగా అఖండ షూటింగ్ జరుగుతోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దామని భైరవద్వీపం పార్ట్ 2 చేస్తారా లేక బొబ్బిలి సింహం పార్ట్ 2 చేస్తారా అని అడుగుతున్నారని రోజా చెప్పుకొచ్చారు.

Star Hero Balakrishna Comments About Jabardasth Show, Balakrishna Comments , Com

రోజా అలా చెప్పగానే బాలకృష్ణ పకపకా నవ్వి మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని చెబుతారు.జబర్దస్త్ కు జడ్జిగా కూడా తాను వస్తానని బాలయ్య పేర్కొన్నారు.రాఘవ, ఆది అందరూ నాకంటే పెద్దవాళ్లని బాలయ్య సరదాగా కామెంట్లు చేశారు.

భవిష్యత్తులో బాలయ్య జబర్దస్త్ కు జడ్జిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే బాలకృష్ణ బుల్లితెర షోలపై దృష్టి పెట్టడంతో నందమూరి అభిమానులు షాకవుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు