NTR: రాజకీయాలంటే ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ తర్వాత.. బాలయ్య ఏం చెప్పారంటే?

స్టార్ హీరో బాలకృష్ణ( Balakarisna )కు తండ్రి ఎన్టీఆర్( NTR ) అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తండ్రి ఎన్టీఆర్ గురించి అభిమానం చాటుకునే ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని బాలయ్య వదులుకోరు.

కొంతమంది ఈ విషయంలో విమర్శలు చేసినా బాలయ్య మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందడుగులు వేస్తున్నారు.రాజకీయాలంటే ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ తర్వాత అని బాలయ్య అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ వల్లే తెలంగాణలో సమూల మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ చేసిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని బాలయ్య పేర్కొన్నారు.41 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల( Telugu Desam Party ) కష్టమేనని ఆయన కామెంట్లు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల సక్సెస్ తో కార్యకర్తలు 2024 ఎన్నికలకు సిద్ధం కావాలని బాలయ్య పిలుపునివ్వడం గమనార్హం.

ఎన్టీఆర్ సినిమాలు, ఎన్టీఆర్ పాలన మాత్రమే పాత తరానికి గుర్తుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.తెలుగు వాళ్లంతా ఒకటేనని ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చడం సరైన నిర్ణయం కాదని ఆయన తెలిపారు.ప్రాంతాలు వేరైనా తెలుగు వాళ్లు అంతా ఒకటేనని బాలయ్య కామెంట్లు చేశారు.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన తెలిపారు.

తెలుగు గడ్డపై సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ విశ్వాసాన్ని నింపారని బాలయ్య చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ నిత్యం వెలిగే దీపం అని ఆయనకు మరణం లేదని బాలయ్య కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ హయాంలోనే పేదలకు కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం జరిగిందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

బాలయ్య వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాలయ్య అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

సినిమా సినిమాకు స్టార్ హీరో బాలకృష్ణ రేంజ్ పెరుగుతుండగా బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు