రవితేజతో జత కట్టబోతున్న నయా పెళ్లి సందడి హీరోయిన్

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో తెలివైన దొంగగా రవితేజ కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కెరియర్ లో మొదటి సారి లాయర్ పాత్రలో రవితేజ కామెడీ పండించడానికి రెడీ అవుతున్నాడు.

త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రవితేజ నెక్స్ట్ సినిమా తెరకెక్కబోతుంది.ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉండబోతుందని టాక్ నడుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు హీరోయిన్స్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

ఖిలాడీ సినిమాలో మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతీ అనే కొత్త హీరోయిన్స్ గా రవితేజ రొమాన్స్ చేస్తున్నాడు.నెక్స్ట్ సినిమా కోసం రవితేజ కోసం ఒకటి, రెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ నే తీసుకుంటున్నాడు.

ఇందులో ఒక హీరోయిన్ గా తమిళ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ ని ఖరారు చేసినట్లు బోగట్టా.ఇక మరో హీరోయిన్ గా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీలని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పెళ్లి సందడితో తెలుగులోకి తెరంగేట్రం చేస్తుంది.ఇప్పుడు ఏకంగా రెండో సినిమానే మాస్ మహారాజ్ లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు