శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.. అప్పటినుంచే వసతి గదుల విడుదల..!

టీటీడీ తిరుమల భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది.ఇప్పటికి జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది టీటీడీ( TTD ).

అయితే ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కూడా టీటీడీ స్పష్టం చేసింది.అయితే అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు మంజూరు అవుతాయి.

టికెట్లను పొందిన వారు సొమ్మును చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.జూలై నెల కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేసింది.

అయితే ఉచిత ప్రత్యేక దర్శనం కోటాను కూడా విడుదల చేయనుంది టీటీడీ.వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేసింది.

Advertisement

అలాగే వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు అలాగే జూన్ నెల కోటాను ఏప్రిల్ 24వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది.అయితే దర్శనం వసతి కేటాయింపులు మాత్రం సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ స్పష్టం చేసింది.ఇక మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది.

దీనితోపాటు తిరుపతిలో మే నెల గదుల కోటాను కూడా ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయిస్తున్నట్లు టీటీడీ భక్తులకు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు