నాన్న పరిస్థితి అలాగే ఉంది, ఎస్పీ చరణ్‌ కన్నీరు

ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా పాజిటివ్‌ స్వల్ప లక్షణాలతో చెన్నైలోని ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు.కొన్ని రోజుల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.

ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.శ్వాస తీసుకోవడంకు కూడా ఇబ్బంది పడుతున్న బాలు గారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.

కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది అంటూ వైధ్యులు చెబుతున్నారు.దేశంలోని అత్యున్నత డాక్టర్లు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

అయినా కూడా ఆయన ఆరోగ్యం గత నాలుగు రోజులుగా అలాగే ఉంది.ఏమాత్రం మార్పు రాలేదు అంటున్నారు.

Advertisement

ప్రతి రోజు మాదిరిగానే నేడు కూడా బాలు తనయుడు చరణ్‌ వీడియో విడుదల చేశారు.నాన్న ఆరోగ్యం అలాగే ఉంది.

ఆయన ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నారు.ఆయన త్వరలోనే ఆరోగ్యంగా రావాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలు మాకు బలాన్ని ఇస్తున్నాయని అన్నాడు.

తన తండ్రి కోసం సామూహిక ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు.తండ్రి ఆరోగ్యం విషయంలో కన్నీరు పెట్టుకున్న చరణ్‌ వణుకుతూ మాట్లాడారు.

ఆయన గొంతు లోనుండి ఆందోళతో కూడిన మాటలు వచ్చాయి.గత నాలుగు అయిదు రోజులుగా అదే పరిస్థితుల్లో తండ్రి ఉండటంతో చరణ్‌ భావోద్వేగానికి లోను అవుతున్నట్లుగా ఈ వీడియోలో చూడవచ్చు.

ఎన్టీఆర్ దేవర 2 నుంచి బిగ్ అప్డేట్....అభిమానులకు పూనకాలే?
Advertisement

తాజా వార్తలు