బీజేపీని అనుకున్నంత స్థాయిలో సోము వీర్రాజు న‌డిపించ‌ట్లేదా..?

ఇటు తెలంగాణ‌లో బీజేపీ పార్టీ ఎంత‌లా దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం.రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీనే గెలుస్తుంద‌నే అభిప్రాయాన్ని క‌న‌బ‌రుస్తున్నారు తెలంగాణ బీజేపీ నేత‌లు.

కానీ అటు ఏపీలో మాత్రం బీజేపీ అనుకున్న మేర‌కు రాణించ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు ఈ మ‌ధ్య బాగా వినిపిస్తున్నాయి.ఏప‌పీ బీజేపీ శాఖ‌కు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు అంతో ఇంతో త‌న మాట‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నా కూడా ప్రాంతీయ పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, జ‌నేసేన రేంజ్‌లో లేద‌ని అంద‌రూ చెబుతున్నారు.

ఆయ‌న్ను అన్ని విధాలుగా స‌మీక‌ర‌ణాలు జ‌రిపిన త‌ర్వాత కాపు సామాజిక వర్గం కాబ‌ట్టి మ‌ద్ద‌తు బ‌లంగా ఉంటుంద‌నే న‌మ్మ‌కంతోనే ప‌గ్గాలు అప్ప‌గించింది బీజేపీ.పైగా ఆయ‌న ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న వ్య‌క్తి కావ‌డంతో బీజేపీ వాదాన్ని ఇంకా బ‌లంగా వినిపిస్తార‌ని అనుకున్నారు.

ఇటు ఏపీలో కూడా తటస్థ ఓటర్లు ఎక్కువగా ఉండ‌టం వ‌ల్ల వీరిని హిందూ భావ‌జాలంతో త‌మ‌వైపు మ‌ళ్లించుకోవాల‌ని కేంద్రం బీజేపీ పెద్దలు భారీగా అంచ‌నాలు వేశారు.కానీ వారిని త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలో సోము వీర్రాజు ఫెయిల్ అయ్యార‌ని కేంద్రం భావిస్తోంది.

Advertisement

ఇప్ప‌టికే సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాదిన్నర దాటినా కూడా బీజేపీలో కీలక మార్పులు ఏమీ తీసుకు రాలేక‌పోయారు.కేవ‌లం ప‌వ‌న్ ఇమేజ్‌ను ఆధారంగా చేసుకునే రాజ‌కీయాలు చేస్తున్నారు త‌ప్ప సొంతంగాఎలాంటి ఎజెండాను ముందుకు తీసుకెల్ల‌ట్లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.మొన్న‌టికి మొన్న తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తుతో పోటీ చేసినా ఫ‌లించ‌లేదు.

ఆ త‌ర్వాత ది.పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ ఇవ్వ‌లేదు.క‌నీసం ప‌రువు నిలుపుకునే ఓట్లు కూడా రాబ‌ట్టుకోలేక‌పోయింది.

దీంతో ఆయ‌న‌పై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.ఇంకోవైపు కేంద్రం ఏపీ ప‌ట్ల తీసుకుంట‌న్న నిర్ణ‌యాలు కూడా మైన‌స్‌గా మారాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు